
బ్రెజిల్ లో కాల్పుల మోత మోగింది. పారా రాష్ట్రం బెలెమ్ నగరంలోని ఓ బార్ లో గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. కాల్పులు జరిపి పారిపోతున్న దుండగుల్లో ఒకరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియలేదు.