హెహెచ్​సీఎల్​ లాభంలో  11 శాతం పెరుగుదల

హెహెచ్​సీఎల్​ లాభంలో  11 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. నాలుగో క్వార్టర్లో కంపెనీకి రూ. 3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం వచ్చింది. ఇది అంతకు ముందు ఏడాది క్యూ4 తో పోలిస్తే 10.85 శాతం ఎక్కువ. కానీ, సెక్వెన్షియల్​గా చూస్తే మాత్రం నికర లాభం 2.8 శాతం తగ్గిపోయింది. నాలుగో క్వార్టర్లో హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ ఆపరేటింగ్​ లాభం 7.5 శాతం తగ్గినా, ఏడాది కాలానికి చూసినప్పుడు 18.8 శాతం పెరిగింది. మార్చి 2023 తో ముగిసిన క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ 17.74 శాతం ఎక్కువై రూ. 26,606 కోట్లకు చేరింది.

డిసెంబర్​ 2022 క్వార్టర్లో కంపెనీకి రూ. 26,700 కోట్ల రెవెన్యూ వచ్చింది. మార్చి 2023 క్వార్టర్లో సర్వీసెస్​ రెవెన్యూ 10.6 శాతం పెరిగిందని, డిజిటల్​ రెవెన్యూ ఏడాది కాలంలో  16.9 శాతం జంప్​ అయిందని కంపెనీ వెల్లడించింది. నాలుగో క్వార్టర్లో 13 పెద్ద డీల్స్​ను హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ దక్కించుకుంది. ఇక నాలుగో క్వార్టర్లో ఉద్యోగుల సంఖ్య 3,674 పెరిగి 2,25,944 కి చేరినట్లు కూడా కంపెనీ తెలిపింది. మరో  ఏడాది మంచి ప్రోగ్రెస్​ కనబరచగలిగామని హెచ్​సీఎల్ చైర్​పర్సన్​ రోష్నీ నాడార్​ మల్హోత్రా చెప్పారు.