
కరీంనగర్ లో ఇండోనేషియా వాళ్లతో కలిపి పదకొండు పొజిటివ్ కేసులు గుర్తించామని తెలిపారు సీపీ కమలాసన్ రెడ్డి. వారిలో ఒకరు స్థానికుడని, పది మంది ఇండోనేషియా దేశస్తులని చెప్పారు. ఇండోనేషియా బృందంతో తిరిగిన వారందరినీ క్వారాంటైన్ తరలించామని తెలిపారు. ఇండోనేసియా వాసులు సంచరించిన ప్రదేశాల్లో 560 మందిని హోమ్ కోరంటై న్ లో ఉన్నారన్న సీపీ. . వాళ్ళ పాస్ పోర్ట్ లను సీజ్ చేశామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. రాబోయే రెండు వారాలు చాలా కీలకమని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందన్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని… కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మాకు సహకరించి, ఇళ్లకే పరిమితం కావాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దన్నారు. అన్ని ప్రార్థనా మందిరాల దగ్గర ఎవరూ ప్రార్థనలు చేయకూడదని.. ఇళ్ల దగ్గరే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
హోం క్వారాంటైన్ నుంచి పారిపోయిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. హోం క్వారాంటైన్ లో ఉండే వారి పాస్ పోర్ట్ లను ప్రభుత్వ ఆదేశానుసారం స్వాధీనం చేసుకున్నామని హోమ్ క్వారంటైన్ తర్వాత వారి పాస్ పోర్ట్ లను తిరిగి ఇచ్చేస్తామని..నిర్లక్షంగా తిరిగే యువతను హెచ్చరిస్తున్నామన్నారు. అనవసరంగా బయటికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సీపీ.. పోలీసులు బలప్రయోగం చేయాల్సిన పరిస్థితి తేవద్దన్నారు. అత్యవసర వస్తువుల కోసం తప్ప ఊరికేనే ఎవరు బయటకు రావొద్దన్నారు. చట్ట పరంగా కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమెర్జెన్సీ అవసరాలకు మాత్రమే 100కి డయల్ చేయాలని.. మంగళవారం రాత్రి నుంచి ప్రతి చిన్న విషయానికి 100 కి చాల మంది కాల్ చేశారన్నారు.