రైతులకు గుడ్​ న్యూస్​: 1.10 లక్షల కిసాన్​ క్రెడిట్​ కార్డులు పంపిణి

రైతులకు గుడ్​ న్యూస్​: 1.10 లక్షల కిసాన్​ క్రెడిట్​ కార్డులు పంపిణి

రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు  ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి.  రైతు రుణ మాఫీ... పెట్టుబడి సాయం...  పీఎం కిసాన్​ సమృద్ది యోజన పథకం ఇలా అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి.  కిసాన్​ క్రెడిట్​ కార్డ్​రైతులకు ఇస్తామని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. ఎవ్వరికి ఇచ్చిన దాఖలాలు లేవు.  కానీ యూపీ ప్రభుత్వం 75 జిల్లాల్లోని..  1.10 లక్షల మంది రైతులకు కిసాన్​ క్రెడిట్​ కార్డులు పంపిణి చేసింది.  డిసెంబర్​ 2023తో ముగిసే ఆర్ధిక సంవత్సరం త్రైమాసిక నివేదికను పరిశీలించిన సీఎం యోగి రైతులకు రుణాల రూపంలో ఆర్థిక ప్రోత్సహకాలు అందించాల్సిన అవసరం ఉందని బ్యాంకులకు ఉందన్నారు. రైతులను ఆదుకొనేందుకు బ్యాంకులు శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నాయని.. బ్యాంకుల పని తీరును ప్రసంసించారు.  

రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం (కెసిసి స్కీమ్) అమలులో ఉందని తెలిపారు.  బరోడా బ్యాంక్​, యూపీ గ్రామీణ బ్యాంక్​, ఆర్టవర్ట్​ గ్రామీణ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు ఆర్ధిక సాయం చేయుటకు నిధులను జమ చేసింది. దీంతో కిసాన్​ క్రెడిట్​ కార్డుకు దరఖాస్తు చేసుకొని అర్హులైన 1.10 లక్షల మంది రైతులకు కిసాన్​ క్రెడిట్​ కార్డ్​లతో పాటు బీసీలకు టూల్​ కిట్​ లను పంపిణీ చేశారు. 

బ్యాంకర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి... ప్రతి నెలా జిల్లాలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు.  సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం కింద HDFC బ్యాంక్​ ద్వారా 150 గ్రామాల దత్తత ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు.  రైతులను ఆదుకోవడంతో పాటు ఈ గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు.  రైతులకు రుణం మంజూరు చేసే విషయంలో బ్యాంకులు వెనుకాడవద్దని సీఎం యోగి సూచించారు. . రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'ఫ్యామిలీ ఐడీ'ని ప్రస్తావిస్తూ, అన్ని బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పూర్తి డేటాను అందించాలని అన్నారు.