కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ

కరోనాను జయించిన 110 ఏళ్ల బామ్మ

కరోనా బారినపడి నిత్యం వేలాది మంది మరణిస్తున్నారు. కొంతమంది కరోనాకు భయపడే ప్రాణాలొదులుతున్నారు. అయితే కర్ణాటకకు చెందిన 110 ఏళ్ల బామ్మ మాత్రం కరోనాను ఆరు రోజుల్లోనే అంతమొందించింది. చిత్రదుర్గకు చెందిన సిద్దమ్మ అనే బామ్మ జూలై 27న కరోనాతో జిల్లా ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమె కరోనా వచ్చిందని ఏ మాత్రం భయపడకుండా ఆత్మస్థైర్యంతో వైద్యులకు సహకరించింది. దాంతో ఆమె కేవలం ఆరు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకుంది.

చిత్రదుర్గ ఆస్పత్రి డాక్టర్ బసవరాజ్ మాట్లాడుతూ.. ‘సిద్ధమ్మకు జూలై 27న కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమెకు నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే ఈ రోజు కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్తుంది’ అని అన్నారు.

కర్ణాటకలో శనివారం 5,172 కరోనా కేసులు నమోదు కాగా.. 98 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 1,29,287గా ఉండగా.. 73,219 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 53,648 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 2,412కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

For More News..

కరోనాతో ఎంజీఎం ల్యాబ్ టెక్నిషియన్ మృతి

పెళ్లయి.. ఒక పిల్లాడు.. అయినా ఇంటర్‌‌‌‌లో టాపర్ గా..

రాఖీ పండుగకు వెళ్తూ అన్న కళ్లెదుటే చెల్లెలి మృతి