వోడాఫోన్‍లో భారీ కోతలు.. 11వేల ఉద్యోగులకు షాక్

వోడాఫోన్‍లో భారీ కోతలు.. 11వేల ఉద్యోగులకు షాక్

ఉద్యోగాల కోతల ప్రక్రియ సాఫ్ట్ వేర్ నుంచి, ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఇప్పుడు టెలికం దిగ్గజాలకు చేరుకుంది. ప్రముఖ టెలికాం దిగ్జజం వోడాఫోన్ వచ్చే 3ఏళ్లలో 11వేల ఉద్యోగులను తొలిగించాలని నిర్ణయించింది. ఇది టెలికాం పరిశ్రమలో అతిపెద్ద తొలగింపులలో ఒకటి. అంతకుముందు టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలు తక్కువగా లేదా ఎటువంటి వృద్ధిని అంచనా వేయకుండా కంపెనీ "సరళమైన" సంస్థను కోరుతున్నందున ఉద్యోగాలను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు వోడాఫోన్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్గరీటా డెల్లా వల్లే స్పష్టం చేశారు.

ప్రస్తుతం తమ కంపెనీలో పని తీరు తగినంతగా లేదని, కస్టమర్లకు సులభతరమైన సేవలు అందించాలను చూస్తున్నట్టు డెల్లా తెలిపారు. అందుకు వోడాఫోన్ లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పోటీతత్వాన్ని మళ్లీ పొందేందుకు కస్టమర్లకు క్వాలిటీ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.
వోడాఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఇటలీలో 1,000 మందిని తొలగించింది. జర్మనీలో 1,300 మందిని తగ్గించాలని చూస్తున్నట్లు ఓ మీడియా నివేదిక తెలిపింది.