11.19 లక్షల టన్నుల యూరియా సప్లై

11.19 లక్షల టన్నుల యూరియా సప్లై

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కెమికల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌) ప్లాంట్‌‌‌‌‌‌‌‌ నుంచి 2023-–24 ఆర్థిక సంవత్సరంలో 11.19 లక్షల టన్నుల యూరియాను సప్లై చేసినట్లు ప్లాంట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఝా సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు.

 తెలంగాణకు 4,45,861.89 టన్నులు, ఏపీకి 1,53,383.94 టన్నులు, కర్ణాటకకు 1,83,070.44 టన్నులు, మహారాష్ట్రకు 78,745.23 టన్నులు, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌కు 85,862.07 టన్నులు, తమిళనాడుకు 99,006.03 టన్నులు, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు 74,093.94 టన్నుల యూరియా సప్లై చేసినట్లు ప్రకటించారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించడంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు.