
హైదరాబాద్ : ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 గురుకులాలను జూన్ 17 సోమవారం రోజున ప్రారంభించాలని డిసైడైంది.
అన్ని జిల్లాల అధికారులకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. జూన్ 17న నియోజకవర్గ ఎమ్మెల్యేలు గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు రాష్ట్రప్రభుత్వం సూచించింది.