
సత్యదేవ్, ఆనంది లీడ్ రోల్స్‌లో వి.వి. సూర్య కుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’. ఈ సర్వైవల్ డ్రామాకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు క్రియేటర్స్‌గా వ్యవహరించగా.. వై. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.
లేటెస్ట్గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ థ్రిల్లర్ సిరీస్ ఇండియాలో మాత్రమే కాకుండా 240 కి పైగా దేశాల్లో ప్రైమ్లో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉండనుందని తెలిపారు.
ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఓ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటన నేపథ్యంలో సాగే ఫిక్షన్ స్టోరీ ఇది. మత్స్యకారుల సముద్రపు ప్రమాదాలు, బందీలుగా వారి జీవితాలను ప్రధానంగా ఇందులో చూపించబోతున్నారు.
ALSO READ : KINGDOM: మృత్యువు జడిసేలా.. శత్రువు బెదిరేలా.. కింగ్‌డమ్ కొత్త సాంగ్ గూస్బంప్స్
అలాగే, వీరు సముద్ర మార్గంలో వెళ్ళేటపుడు ఊహించని స్నేహాలు, అనుకోని కొత్త సంబంధాలు, ఎదుర్కొనే భయంకరమైన శత్రువుల మూలాలు ఆసక్తిగా ఉండనున్నాయి. ఈ క్రమంలో రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో సత్యదేవ్, ఆనంది ఇంటెన్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సత్యదేవ్ జైలు ఊచల వెనుక ఉండటం, అతనితో పాటు చిక్కుకున్న వ్యక్తుల కళ్ళల్లో భయం ఆసక్తి రేపుతుంది. డైరెక్టర్ క్రిష్ శిష్యులలో ఒకరైన వెర్స్ ఫైవ్ సూర్య కుమార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లతో రానుంది.
time and tide wait for none, neither does their fate 🌊#ArabiaKadaliOnPrime, New Series, August 8@ActorSatyaDev @anandhiactress @DirKrish @DirectorSuryaVV @NagavelliV @firstframe_ent pic.twitter.com/5ACNKK4XHG
— prime video IN (@PrimeVideoIN) July 28, 2025
కథ:
అసాధారణ పరిస్థితుల్లో గల్ఫ్ దేశంలో చిక్కుకున్న సాధారణ వ్యక్తుల ధైర్యాన్ని, సహనాన్ని ప్రశంసించేలా కథ ఉండబోతోందని తెలుస్తోంది. అంతేకాకుండా అనుకోకుండా జైలు పాలయ్యిన వారు, అక్కడి నుండి ఎలా బయటపడటానికి ప్రయత్నించారనే కథాంశంతో తెరకెక్కిందని పోస్టర్ బట్టి అర్ధమవుతుంది. ఇందులో నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, వంశీ కృష్ణ కీలక పాత్రలు పోషించారు.
మరోవైపు, సత్యదేవ్ నటించిన కింగ్‌డమ్ మూవీ (జులై31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇందులో విజయ్ దేవరకొండ సోదరుడు శివ అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు.