KINGDOM: మృత్యువు జడిసేలా.. శత్రువు బెదిరేలా.. కింగ్‌డమ్ కొత్త సాంగ్ గూస్బంప్స్

KINGDOM: మృత్యువు జడిసేలా.. శత్రువు బెదిరేలా.. కింగ్‌డమ్ కొత్త సాంగ్ గూస్బంప్స్

గౌతమ్-విజయ్ కాంబోలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్‌డమ్’ (KINGDOM). ఈ మూవీ టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్తో ఆడియన్స్లో ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే మరో పవర్ ఫుల్ సాంగ్ రిలీజై.. కింగ్‌డమ్పై అంచనాలు మరింత రెట్టింపు చేసింది.

లేటెస్ట్గా కింగ్‌డమ్ నుంచి ‘రగిలే రగిలే’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాట కింగ్‌డమ్ మూవీకి పవర్ ఫుల్ సోల్ లాంటిదని మేకర్స్ తెలిపారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్దార్థ్ బస్రూర్, అనిరుధ్ కలిసి పాడారు. ఈ పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుధ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఆడియన్స్ని ఉత్తేజపరిచారు కూడా.

ALSO READ : సిద్ధు జొన్నల గడ్డ తెలుసు కదా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్

‘‘మృత్యువు జడిసేలా.. పద పద.. శత్రువు బెదిరేలా.. పద పద.. గర్జన తెలిసేలా.. పద పద.. దెబ్బకు గెలిచేలా.. పద పదా..’’ అని కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కృష్ణకాంత్ రాసిన అన్న అంటూనే, హృదయం లోపల సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడీ  ‘రగిలే రగిలే’సాంగ్ కింగ్‌డమ్ మ్యూజిక్ బాక్స్లో చార్ట్ బ్లాస్టర్గా నిలిచే అవకాశం ఉంది. కింగ్‌డమ్ జూలై 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.