సిద్ధు జొన్నల గడ్డ తెలుసు కదా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్

సిద్ధు జొన్నల గడ్డ  తెలుసు కదా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్

నచ్చేస్తుందే.. నీతో ఉండే ప్రతిక్షణమే..

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’.  ప్రముఖ స్టైలిస్ట్  నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.   ప్రస్తుతం ఈ  మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన  మేకర్స్.. సోమవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన పాటకు కృష్ణకాంత్ క్యాచీ లిరిక్స్ రాశాడు. సిద్ శ్రీరామ్ పాడిన విధానం ఆకట్టుకుంది.

 ‘ఆకాశం అందిందా.. నేలంతా నవ్విందా.. ఉన్నట్టుండి ఏదో మారిందా.. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా.. కన్నుల్లో నింపే వీలుందా.. నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే.. మాంగళ్యం కట్టే సమయం.. ఏడడుగులతోనే పయనం.. ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే.. నచ్చేస్తుందే.. నచ్చేస్తుందే.. నీతో ఉండే ప్రతిక్షణమే.. మల్లిక గంధ’ అంటూ సాగిన పాటలో సిద్దు, రాశీఖన్నా స్టైలిష్ లుక్‌‌‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు.  తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాల్ని మోడరన్ టచ్‌‌‌‌లో వినిపించడం ఆకట్టుకుంది. హైదరాబాద్‌‌‌‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్‌‌‌‌తో పాటు దర్శకురాలు నీరజ, నిర్మాత  టీజీ విశ్వ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది.