మోహినిపుర వీధిలోని దేవాలయ భూములను కాపాడండి : ఉడత మల్లేశ్ యాదవ్

మోహినిపుర వీధిలోని దేవాలయ భూములను కాపాడండి : ఉడత మల్లేశ్ యాదవ్

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట పట్టణం మోహినిపుర వీధిలో వెలిసిన పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను కాపాడాలని సిద్దిపేటకు చెందిన యాదవ సంఘం అధ్యక్షుడు ఉడత మల్లేశ్ యాదవ్ కోరారు. సోమవారం దేవాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..  దేవాలయంలో ధర్మకర్తగా ఉన్న వారికి దేవాలయంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

 1975లో సిద్దిపేటకు చెందిన కొంతమంది ప్రముఖులు, పెద్దలు, మోహిని పురచెందిన కొంతమంది కలిసి ప్రభుత్వ భూమిలో దేవాలయం నిర్మించారని, ఆ సమయంలో రెవెన్యూలో పనిచేసిన వెంకట నరసయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని, దేవాలయం కు చెందిన ప్రభుత్వ భూమి ఐదు ఎకరాల భూమిని తన పేరు మీద చేయించుకున్నాడని ఆరోపించారు.