NBK: బాలయ్యకు తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన బాలీవుడ్ ఏకైక హీరోయిన్ !

NBK: బాలయ్యకు తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన బాలీవుడ్ ఏకైక హీరోయిన్ !

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో  కొందరు నటీనటులు తమ అద్భుతమైన నటనతో, నిస్సంకోచమైన నిర్ణయాలతో చెరగని ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో టబు (Tabu) ఒకరు.  ఆమె అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హాష్మీ (Tabassum Fatima Hashmi) అయినప్పటికీ, టబుగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మూడు దశాబ్దాలకు పైగా తన సినీ కెరీర్‌లో, బాలీవుడ్ , దక్షిణాది చిత్రాల మధ్య ఎలాంటి అడ్డుగోడ లేకుండా అలవోకగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. తన నటనతో ప్రత్యేకతను చాటుకుంటూ కొనసాగుతున్నారు. అద్భుతమైన నటనతో మెప్పించిన టబు ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, తెలుగులో ఒకే ఒక్క నటుడితో మూడు విభిన్న పాత్రలు నటించింది. ఆయన ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) . ఆయనకు తల్లిగా, భార్యగా , ప్రియురాలుగా నటించి మెప్పించారు.

తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా.. 
సినిమా చరిత్రలో చాలా అరుదైన, ఆసక్తికరమైన కాస్టింగ్ ట్విస్ట్‌లలో ఒకటి టబుది. 2002లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా 'చెన్నకేశవ రెడ్డి' (Chennakesava Reddy) చిత్రంలో టబు, బాలకృష్ణకు భార్యగా,  తల్లిగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించారు.  ఈ మూవీ అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా, టబు నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆరేళ్లకు, 2008లో వచ్చిన 'పాండురంగడు' (Pandurangadu) సినిమాలో ఆమె బాలకృష్ణ సరసన రొమాంటిక్ పాత్రలో తిరిగి కనిపించారు. ఈ అసాధారణ పాత్రలు ఆమె నటనకు పదును పెట్టడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో ఒకే హీరోకు మూడు విభిన్న జనరేషన్ల పాత్రల్లో నటించడం మాములు విషయం కాదు. ఇది తబు నటనకు, ఆమె బహుముఖ నటనకు నిదర్శనం. ఇది ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

గుర్తింపు తెచ్చిన టాలీవుడ్
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన టబు సినీ రంగ ప్రవేశం తన 11 ఏళ్ల వయసులోనే జరిగింది. 1982లో వచ్చిన 'బజార్' (Bazaar) చిత్రంలో  ఒక చిన్న పాత్రలో కనిపించారు. అయితే, ఆమెకు తొలి పెద్ద బ్రేక్ తెలుగు సినిమా ద్వారానే వచ్చింది. 1991లో వెంకటేష్ (Venkatesh) సరసన నటించిన 'కూలీ నెం. 1' (Coolie No. 1) చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. 1994లో విడుదలైన ' పెహ్లా పహ్లా ప్యార్ ' టబు తొలి హిందీ చిత్రం.  ఆతర్వాత 'విజయ్ పథ్' చిత్రంలో  అజయ్ దేవగన్ ( Ajay Devgn )తో కలిసి నటించింది. దీంతో వారిద్దరి మధ్య సుదీర్ఘమైన ఆన్ స్క్రీన్ అనుబంధం మొదలైంది. ఈ ఇద్దరి కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హింట్ అందుకున్నాయి.

►ALSO READ | 'యూనివర్సిటీ పేపర్ లీక్'.. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టిన ఆర్. నారాయణమూర్తి

సింగిల్ గానే జీవితం..
ప్రస్తుతం 53 సంవత్సరాలున్న టబు ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. పెళ్లిపై అనేక ఊహగానాలు కూడా వచ్చాయి.  ఈ విషయం తరచుగా మీడియా ప్రశ్నించినా దాటవేసింది. వివాహం చేసుకోకపోయినా ఆమె తన కెరీర్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా తబు తన సత్తా చాటారు. 'దూన్: ప్రొఫెసీ' (Dune: Prophecy) చిత్రంతో హాలీవుడ్‌లో (Hollywood) అడుగుపెట్టడం ద్వారా ఆమె తన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసుకున్నారు. తబుకు భాషా హద్దులు లేవు, ప్లాట్‌ఫామ్ హద్దులు లేవు అని ఆమె నిరూపించారు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నారు.