IPO News: మార్కెట్ల పతనంలో దూసుకుపోతున్న ఐపీవో.. లిస్ట్ కాగానే అప్పర్ సర్క్యూట్

IPO News: మార్కెట్ల పతనంలో దూసుకుపోతున్న ఐపీవో.. లిస్ట్ కాగానే అప్పర్ సర్క్యూట్

Savy Infra IPO: చాలా కాలం తర్వాత ఐపీవోల కోలాహలం ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచెత్తుతోంది. మార్కెట్ల ఒడిదొడుకుల్లో ఐపీవో బెట్టింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం మంచి ఫలితాలను, రాబడులను చూస్తున్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో జాబితా అయిన సావీ ఇన్ ఫ్రా కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈలో 14 శాతం ప్రీమియం ధర రూ.136.50 వద్ద ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి నేడు మార్కెట్లు పతనంలో కొనసాగుతున్నప్పటికీ ఐపీవో పాజిటివ్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచెత్తింది. అయితే లిస్టింగ్ తర్వాత కూడా షేర్ల కొనుగోలుకు పెరిగిన డిమాండ్ కారణంగా స్టాక్ 5 శాతం పెరిగి రూ.143 స్థాయికి చేరుకుంది.

వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.120 రేటుకు ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.2లక్షల 73వేల 600 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. కంపెనీ తన ఐపీవోను రిటైల్ పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం జూలై 21 నుంచి 23 వరకు అందుబాటులో ఉంచింది.

కంపెనీ దేశీయ మార్కెట్ల నుంచి విజయవంతంగా రూ.69కోట్ల 98 లక్షలను సమీకరించింది. ఇందుకోసం పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. 114 సార్లు సబ్ స్క్రిప్షన్ చూసిన ఐపీవో నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రధానంగా అధిక డిమాండ్ చూసింది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.19కోట్ల 93 లక్షలను సమీకరించింది. 

కంపెనీ వ్యాపారం..
జనవరి 2006లో స్థాపించిన సావీ ఇన్‌ఫ్రా సంస్థ రోడ్డు నిర్మాణం, సబ్-గ్రేడ్ తయారీ, ఉపరితల పేవింగ్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మట్టి పనులు, పునాది పనులు నిర్వహించటంలో ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే కొత్త ప్రాజెక్టుల కోసం నిర్మాణాలను సురక్షితంగాకూల్చివేతకు అవసరమైన సేవలను అందిస్తోంది. అసెట్ లైట్ మోడల్ కింద ట్రక్కులు డ్రైవర్లను అద్దెకు తీసుకుని కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. కంపెనీ ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించింది.