హుజూరాబాద్ బైపోల్.. బరి నుంచి 12 మంది విత్ డ్రా..

హుజూరాబాద్ బైపోల్.. బరి నుంచి 12 మంది విత్ డ్రా..

కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన హుజూరాబాద్ బైపోల్‎కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ ఉపఎన్నిక కోసం మొత్తం 42 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 12 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దాంతో 30 మంది బరిలో నిలిచే అవకాశాలున్నాయి. వారందరి నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం.. సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ నెల 30 ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడుతాయి. కాగా.. ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీలో ఉన్నారు. ఈ ఉపఎన్నికను టీఆర్ఎస్, బీజేపీలు ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా తీసుకొని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

For More News..

గతిశక్తి మాస్టర్ ప్లాన్ ప్రారంభించిన మోడీ

ఆయన మంత్రిగా ఉన్నంతకాలం న్యాయం జరగదు: రాహుల్ గాంధీ

ఈ పాస్‎వర్డ్‎లు వాడితే ఈజీగా హ్యాక్ అవుతారు