ఈ పాస్‎వర్డ్‎లు వాడితే ఈజీగా హ్యాక్ అవుతారు

ఈ పాస్‎వర్డ్‎లు వాడితే ఈజీగా హ్యాక్ అవుతారు
  •  బీ కేర్‎ఫుల్.. ఈ పాస్‎వర్డ్‎లు పెట్టుకుంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చట

ఇంటర్‎నెట్, సోషల్ మీడియా వినియోగదారులు తమ అకౌంట్లకు సంబంధించిన పాస్‎వర్డ్‎లను ఈజీగా గుర్తుండేలా పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకోవడం వల్ల సైబర్ క్రైమ్‎కు పాల్పడే వాళ్లు చాలా సింపుల్‎గా వినియోగదారుల ఖాతాలను హ్యాకింగ్ చేయగలుగుతారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పాస్‎వర్డ్‎ల హ్యాకింగ్‎కు సంబంధించి మొజిల్లా ఫౌండేషన్ ఓ నివేదిక ప్రచురించింది. దాని ప్రకారం.. చాలామంది వినియోగదారులు సూపర్ హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని.. దాన్ని మానుకోవాలని సూచించింది. అలా వాడటం వల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు చాలా సింపుల్‎గా యాక్సెస్ చేస్తారని నివేదిక హెచ్చరిస్తోంది. 

Haveibeenpwned.com అనే వెబ్‌సైట్ ప్రకారం.. చాలామంది సూపర్ హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని.. ఇది చాలా ప్రమాదమని మొజిల్లా తెలిపింది. అదేవిధంగా వినియోగదారుని మొదటి పేరు, పుట్టిన తేదీ లేదా 123456 వంటివి ప్రపంచంలో చాలామంది అత్యంత సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లని సదరు వెబ్‌సైట్ తెలిపింది. సోషల్ మీడియా ఖాతాదారులు ఎక్కువగా Superman, Batman, Spider-Man, Wolverine, Iron Man, Wonder Woman, Daredevil, Thor, Black Widow, Black Panther వంటి సూపర్ హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారని ప్రకటించింది. పాస్‌వర్డ్‎లను మరింత క్లిష్టంగా ఉండేలా చూసుకోవాలని.. అందుకోసం పాస్‎వర్డ్‎లో సంఖ్యలు, అక్షరాలు మరియు సంకేతాలను వంటివి చేర్చడం వల్ల పాస్‌వర్డ్ క్రాక్ చేయడం హ్యకర్లకు చాలా కష్టంగా మారుతుందని మొజిల్లా తెలిపింది. 

ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ తన వార్షిక నివేదికలో ఖాతాదారులు ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 2020 సంవత్సరంలో ‘123456’ అత్యంత సాధారణ పాస్‌వర్డ్ అని, దీనిని 23 మిలియన్లకు పైగా వాడినట్లు పేర్కొంది. అదేవిధంగా ‘123456’ తర్వాత, ‘123456789’ అత్యధికంగా ఉపయోగించిన రెండో పాస్‌వర్డ్‌ అని తెలిపింది. ఈ రెండింటి తర్వాత ‘picture1’ మూడవ స్థానంలో ఉంది. నార్డ్‌పాస్ అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లకు సంబంధించి  టాప్ 200 పాస్‌వర్డ్‌ల లిస్ట్ విడుదలచేసింది. వీటిలో కొన్ని పాస్‌వర్డ్‌లు క్రాక్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టిందని, కానీ మరికొన్ని మాత్రం క్రాక్ అవ్వడానికి ఒక సెకను కన్నా తక్కువ సమయం పట్టిందని సదరు సంస్థ ప్రకటించింది.

For More News..

బిగ్‌‌ సీ నుంచి దసరా ఆఫర్లు