బిగ్‌‌ సీ నుంచి దసరా ఆఫర్లు

బిగ్‌‌ సీ నుంచి దసరా ఆఫర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్మార్ట్‌‌‌‌ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్‌‌‌‌ డివైజ్‌‌‌‌లను అమ్మే రిటైల్‌‌‌‌ చెయిన్‌‌‌‌ బిగ్‌‌‌‌ సీ దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బజాజ్‌‌‌‌ ఫైనాన్స్ ద్వారా మొబైల్‌‌‌‌ కొంటే రూ.3,500 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ ఇస్తారు. ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొంటే రూ.1,500 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ ఉంటుంది. అమెజాన్‌‌‌‌ పేతో మొబైల్‌‌‌‌ కొంటే రూ.3,500 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ వస్తుంది. పేటీఎం మాల్‌‌‌‌తో ఒప్పో మొబైల్స్‌‌‌‌ కొంటే 15 శాతం వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ పొందవచ్చు. శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌ 10 వేల వరకు, వన్‌‌‌‌ప్లస్‌‌‌‌ మొబైల్స్‌‌‌‌పై రూ.ఏడు వేల వరకు, ఎంఐ మొబైల్స్‌‌‌‌పై రూ.మూడు వేల వరకు, వివో మొబైల్స్‌‌‌‌పై 10 శాతం వరకు, ఒప్పో మొబైల్స్‌‌‌‌పై రూ.నాలుగు వేల వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ పొందవచ్చు. స్మార్ట్‌‌‌‌టీవీలపై రూ.4,500 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ అందుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్‌‌‌‌ కూడా ఉందని బిగ్‌‌‌‌ సీ ఫౌండర్‌‌‌‌, సీఎండీ బాలు చౌదరి అన్నారు. కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని బిగ్‌‌‌‌సీ బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌ సూపర్‌‌‌‌స్టార్‌‌‌‌ మహేశ్‌‌‌‌ బాబు కోరారు.