పాకిస్థాన్ పేలుడులో 12 మంది మృతి

పాకిస్థాన్ పేలుడులో 12 మంది మృతి

కరాచీ : పాకిస్థాన్ కరాచీలో భారీ పేలుడు సంభవించింది.షేర్షా పరాచ చౌక్ ఏరియాలో జరిగిన పేలుడులో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాహీద్ మహాత్మా బెనజీర్ భుట్టో హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. పేలుడు ధాటికి దగ్గరలోని భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ బ్యాంకు బిల్డింగ్ కుప్పకూలింది. వాటి శిథిలాల కింద మరికొందరు ఉండి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రెండు ప్రొక్లెయినర్లు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు. 
పరాచా చౌక్ లోని నాలా గుండా ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నాలాపైనే ప్రైవేట్ బ్యాంక్ బిల్డింగ్ ఉండటంతో భవనం కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పేలుడు జరిగిన సమయంలో బ్యాంకు సిబ్బందితో పాటు పలువురు కస్టమర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజబుల్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించారు. పేలుడు ఘటనపై సింధ్ సీఎం సయ్యద్ మురాద్ అలీ షా విచారణకు ఆదేశించారు. 

For more news

కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన

మహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం