మహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం

మహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా నవీ ముంబై ఘన్సోలీలోని ఓ స్కూల్ లో 18మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. స్కూల్ లో 950 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్టూడెంట్స్ కు కరోనా సోకడంతో అధికారులు పాఠశాలను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. బాధిత విద్యార్థులందరినీ స్థానిక కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పాఠశాలలోని మిగిలిన స్టూడెంట్స్ అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. 
కరోనా బారినపడ్డ విద్యార్థుల్లో ఒకరి తండ్రి ఈ మధ్యనే ఖతార్ నుంచి తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తికి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. మిగిలిన కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా.. విద్యార్థికి పాజిటివ్ గా తేలింది. దీంతో స్టూడెంట్ శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు ముంబై మున్సిప్ల కార్పొరేషన్ కమిషన్ ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 10.582 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 40 కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

For more news

గంగా ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

చైనా బోర్డర్‌‌లో మన ఎయిర్‌‌ఫోర్స్ మోహరింపు అట్లనే ఉంది