కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన

కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన

కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీని ద్వారానే స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన వస్తుందన్నారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. భార్యాభర్తలు ఒకచోట ఉంటేనే ప్రశాంతంగా పనిచేయగలరని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం అన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సూచించారు.