
ఆఫ్ఘనిస్థాన్‌లో కారు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. తాలిబన్లు.. ఆఫ్ఘన్‌లోని సెంట్రట్ గజని ప్రావిన్స్‌లో కారు బాంబును పేల్చిరు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘాతుకంలో మరో 50 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా 18 ఏళ్లుగా సాగిస్తున్న యుద్ధానికి తెర దించి, శాంతిని నెలకొల్పేందుకు ఆదివారం ఖతార్‌లోని దోహాలో సమావేశమవుతున్న సమయంలో గజని పట్టణంలో ఈ దాడి జరిగింది. వచ్చే సెప్టెంబరులో జరిగే ఆఫ్ఘన్ ఆధ్యక్ష ఎన్నికలకు ముందు తాలిబాన్లతో రాజకీయ ఒప్పందానికి రావాలని అమెరికా చూస్తోంది. గజని ప్రొవిన్స్‌లోని జాతీయ భద్రతా డైరక్టరేట్ (ఎన్‌డిఎస్) వద్ద కారు బాంబును పేల్చింది తామేనని తాలిబాన్లు ప్రకటించారు.