మయన్మార్‌లో మిలటరీ విమానం కూలి 12మంది మృతి

V6 Velugu Posted on Jun 10, 2021

మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కూలి 12మంది దుర్మరణం చెందారు. వాతావరణం అనుకూలించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్‌ ఓ -ఎల్విన్‌ పట్టణానికి విమానంలో వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12మంది చనిపోయారు. పైన్‌ ఓ- ఎల్విన్‌ పట్టణంలోని కొత్త మఠం శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ బాలుడు సహా మిలటరీకి చెందిన మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది.

Tagged 12 killed, Myanmar Military Plane Crash, Bad Weather

Latest Videos

Subscribe Now

More News