ఐదేళ్లలో 12 కొత్త ఉత్పత్తులు: కోర్టెవా

ఐదేళ్లలో 12 కొత్త ఉత్పత్తులు: కోర్టెవా

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ అగ్రికల్చర్ కంపెనీ కోర్టెవా రాబోయే పదేళ్లలో 12 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు 11 బిలియన్ డాలర్ల పరిశోధన ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో 5 జీవసంబంధ ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ దాదాపు 110 దేశాల్లోని రైతులకు సేవలు అందిస్తోంది. తన విత్తన, జెనెటిక్స్ వ్యాపారాన్ని వేరు చేసినట్టు ప్రకటించింది. 

ఇకపై సంపూర్ణ పంట పరిరక్షణ ఉత్పత్తులపై దృష్టి సారించే అంతర్జాతీయ సంస్థగా నిలవనున్నట్లు ప్రకటించింది. ఆధునిక పరిశోధనల ద్వారా రైతులకు మేలైన టెక్నాలజీలను అందించడమే తమ లక్ష్యమని సీఈఓ ల్యూక్ కిస్సామ్ వెల్లడించారు. 2020–2025 మధ్య కాలంలో కంపెనీ పంట పరిరక్షణ వ్యాపారం బిలియన్ డాలర్లకు పైగా రాబడిని సాధించిందని ప్రకటించారు.