ఢిల్లీలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు

ఢిల్లీలో 12 మంది ఒమిక్రాన్ అనుమానితులు

ఒమిక్రాన్ అనుమానిత కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఢిల్లీలో 12 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (LNJP)ఆస్పత్రిలో  చేర్పించి చికిత్స చేస్తున్నారు అధికారులు. వీరిలో 8 మంది నిన్న (గురువారం) నే ఆస్పత్రికి రాగా.. ఇవాళ (శుక్రవారం) మరో నలుగురు  చేరారు. ఇవాళ వచ్చిన వారిలో ఇద్దరికి  కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వీరిలో యూకే నుంచి ఇద్దరు, ఫ్రాన్స్‌ నుంచి ఒకరు, నెదర్లాండ్స్‌ నుంచి మరొకరు వచ్చినట్లు తెలిసింది. వీరి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపించారు.

ఇప్పటి వరకు  మహారాష్ట్రలో 28 కేసుల‌ను గుర్తించామన్నారు అధికారులు. గురువారం  ఒక్కరోజే విదేశాల నుంచి 861 మంది ప్రయాణికులు వచ్చారని, వారందరికీ RTPCR టెస్టులు చేశామని, 28 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అందులో 25 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు కాగా.. మరో ముగ్గురు వారి కాంటాక్ట్ లన్నారు. మహారాష్ట్రలో గుర్తించిన అనుమానిత కేసుల్లో 10 మంది ముంబైకి చెందిన వారేనని చెప్పారు.