
గోదావరిఖని, వెలుగు: రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు బుధవారం 1.22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గోదావరిఖని ఏసీపీ రమేశ్వివరాల ప్రకారం.. గోదావరిఖని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్ వెనుక చెట్ల పొదల ప్రాంతంలో కొత్తగూడెం బూడిదగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ కోడూరి అభినవ్ వర్ధన్, శివాజీ నగర్ చెందిన పేయింటింగ్ వర్కర్ చెరుకు శ్రీనివాస్ గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై రమేశ్ తనిఖీలు చేపట్టారు. వారి వద్ద 1.220 కేజీల ఎండు గంజాయి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీటింగ్‌లో సీఐ ఇంద్రసేనారెడ్డి, కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.