తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీ!..జిల్లాలవారీగా లిస్టు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ

  తెలంగాణలో 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీ!..జిల్లాలవారీగా లిస్టు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ డీవో పోస్టుల ఖాళీల వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం రిలీజ్ చేసింది. మల్టీజోన్-–1,2 పరిధిలోని మొత్తం 124 ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు 
ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జిల్లాలు, మండలాలవారీగా ఖాళీల జాబితాను ఉన్నతాధికారులు విడుదల చేశారు.  అత్యధికంగా నల్గొండలో 9, కామారెడ్డిలో 7, సిద్దిపేటలో 7, కుమ్రంభీం ఆసిఫాబాద్​7, రంగారెడ్డి 6, నిర్మల్​లోని 6 మండలాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

మల్టీజోన్-–1లో ఆదిలాబాద్, భద్రా ద్రికొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీం నగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజా మాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. మల్టీజోన్–-2లో జనగామ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.