12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం షురూ..ఢిల్లీలో ప్రారంభించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా

12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం షురూ..ఢిల్లీలో ప్రారంభించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
  • యువత గొంతు వినాలని సూచన
  • హాజరైన 21 దేశాల ప్రతినిధి బృందాలు
  • నేడు తెలంగాణ ప్రగతిని వివరించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజల కేంద్రీకృత అభివృద్ధి, ప్రపంచ శాంతి, సుస్థిరత, అంతర్జాతీయ సహకారం పట్ల సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలని బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల పార్లమెంట్లకు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గల సంవిదాన్ సదన్(పాత పార్లమెంట్ భవనం)లో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం–2026ను ఆయన ప్రారంభించారు.

ఈ సమావేశానికి 11 బ్రిక్స్ సభ్య దేశాలు(బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ), 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతోపాటు అన్ని రాష్ట్రాల స్పీకర్లు, అసెంబ్లీ అధికారులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో సంయుక్త ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని ఒక మైలురాయిగా స్పీకర్ ఓం బిర్లా అభివర్ణించారు. ఈ ప్రకటనలోని నిబద్ధతలను క్షేత్రస్థాయి ఫలితాలుగా మార్చడంలో పార్లమెంట్లు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. బ్రిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘పరిష్కారాల పర్యావరణ వ్యవస్థ’గా మార్చాలన్న ప్రధాని దార్శనికతను ఆయన ప్రస్తావించారు. అలాగే, నేటి యువత గొంతును వింటూ, వారి ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకునేలా బాధ్యతాయుతమైన విధానాలను రూపొందించాలని సూచించారు.

నేడు తెలంగాణ అభివృద్ధిపై ప్రసంగం

బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో భాగంగా మంగళవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో సాధిస్తున్న ప్రగతిని, అభివృద్ధి నమూనాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా పెట్టుబడులకు అగ్రగామి గమ్యస్థానంగా మారుతున్న తెలంగాణ ప్రత్యేకతను అంతర్జాతీయ వేదికపై సభ్య దేశాల ముందు ఆయన చాటిచెప్పనున్నారు.