హైదరాబాద్, వెలుగు: డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు టెస్ట్, సిమ్యులేషన్ సొల్యూషన్స్ అందించే డిజి లాజిక్ సిస్టమ్స్ 2027 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) అద్భుత ఫలితాలు సాధించింది. సంస్థ మొత్తం ఆదాయం 91 శాతం వృద్ధితో రూ.34.96 కోట్లకు చేరుకుంది. నికర లాభం 151 శాతం పెరిగి రూ.4.76 కోట్లుగా నమోదైంది. ఎబిటా 126 శాతం పెరిగి రూ.7.81 కోట్లకు చేరింది. 2026 అక్టోబర్ నాటికి కంపెనీ చేతిలో రూ.20 కోట్ల విలువైన ఆర్డర్లు ఉండగా, మరో రూ.54 కోట్ల టెండర్లు తుది దశలో ఉన్నాయి. ఆదాయం, లాభాల పరంగా అన్ని విభాగాల్లో అద్భుతమైన వృద్ధి సాధించినట్లు సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు. ప్రాజెక్ట్ ఉడాన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అభేధ్య సిస్టమ్స్ ద్వారా 2029 హెచ్2లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వివరించారు.
