భద్రాచలం, వెలుగు: ఒడిశా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొస్తున్న యువకులను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ అరుణ్కుమార్కథనం ప్రకారం.. విజయవాడ–జగదల్పూర్జాతీయ రహదారిలో భద్రాచలం శివారు కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద పట్టణ ఎస్సై శ్యాంప్రసాద్సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
బైక్‌పై వస్తున్న భద్రాచలానికి చెందిన మురళీకృష్ణ, దుమ్ముగూడెం మండలానికి చెందిన తెల్లం వంశీకృష్ణ వద్ద 12.928 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా ఒడిశాకు చెందిన విక్రమ్, శంకర్ అనే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.6,46,400 ఉంటుందని డీఎస్పీ తెలిపారు. బైక్‌తో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
