పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్సత్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నా అధికారులు సౌకర్యాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. సత్రాల్లోని లేడీస్ వాష్‌రూమ్‌లు కంపు కొడుతున్నాయని, విరిగిపోయిన తలుపులు, పేరుకుపోయిన పాచి, చెత్తా చెదారంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఓ భక్తురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ అయ్యింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బల్కంపేట సత్రాల్లోని వాష్‌రూమ్‌లను తక్షణమే శుభ్రం చేయించాలని, కనీస వసతులు కల్పించి శాశ్వత ప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
