చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్.. 13 మంది మావోలు మృతి

చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్.. 13 మంది మావోలు మృతి

చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఏప్రిల్ 2న భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.. కోర్చోలి అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 13 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏప్రిల్ 2న  సాయంత్రం వరకు 10 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యం కాగా..ఇవాళ ఉదయం సోదాల అనంతరం మరో ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : అమెరికాలో బర్డ్ ఫ్లూ.. టెక్సాస్ లో చికెన్ బంద్

ఏప్రిల్ 2న  గంగలూరు అటవి ప్రాంతంలో  కూంబింగ్ నిర్వహిస్తున్న డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్, బలగాలకు మావోయిస్టులు తారసబడ్డారు. బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో   భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నిన్నటి నుంచి దాదాపు 8 గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మావోలు మరణించారు.