యువకుడి మర్డర్ కేసులో 13 మంది అరెస్ట్

యువకుడి మర్డర్ కేసులో 13 మంది అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: యువకుడి హత్య కేసులో 13 మంది నిందితులను బాచుపల్లి పోలీసులు బుధవారం రిమాండ్​కు పంపారు.  నలుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించారు.  బాచుపల్లి  సీఐ ఉపేందర్​ తెలిపిన ప్రకారం.. గతేడాది అక్టోబర్​24న ఎస్ఆర్​నగర్​ పరిధిలోని దాసరామ్​బస్తీకి చెందిన యువకుడు తరుణ్​రాయ్(22) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులైన షేక్​షరీఫ్, బూరగోని అభిషేక్​ అలియాస్​ అభి, పిల్లి తేజస్​ అలియాస్​ తేజ, బండ నాగరాజు, గజానంద్​రాహుల్​, రాబిన్​ బెన్సీలు అరెస్ట్​ అయ్యారు. ఇటీవల షేక్​ షరీఫ్,​ తేజస్​ బెయిల్ పై వచ్చారు. దీంతో తరుణ్​రాయ్ బంధువు రోహిత్ తన ఫ్రెండ్ దినేశ్ తో పాటు మరికొందరితో కలిసి తేజస్​ను మర్డర్​ చేసేందుకు ప్లాన్​ చేశారు. 

ముందుగా తేజస్ ఇంటిని కామన్ ఫ్రెండ్ శివప్ప ద్వారా కనుగొనడమే కాకుండా హత్య చేయాలని కోరారు. గత ఆదివారం రాత్రి ప్రగతినగర్ లోని తేజస్ ఇంట్లో శివప్పతో పాటు ఫ్రెండ్స్ కౌషిక్, మహేశ్​మద్యం తాగారు. అప్పటికే మోతీనగర్​లోని అల్​సఫా హోటల్​ వద్ద రోహిత్​తన ఫ్రెండ్స్ తో వచ్చి ఎదురు చూస్తున్నారు. శివప్పవాళ్లకు లొకేషన్ షేర్​చేశాడు. ముందుగా సిద్దేశ్వర్​నాయక్​, జయంత్​​ప్రగతినగర్​ కు వచ్చారు.  రోహిత్, దినేశ్, ప్రతీక్, రాహుల్, సునీల్​, గనప్ప, సంతోష్​, శ్రీకర్​ తమ బైక్ లపై వచ్చి అక్కడికి వచ్చి పరిసరాలను గమనించారు. 

తేజస్​ను శివప్ప సిగరెట్​ తాగుదామని బిల్డింగ్​పై నుంచి కిందికి తీసుకొచ్చి  స్కూటీపై ఎక్కించుకుని సమీర్​, సిద్దేశ్వర్​ నాయక్​, జయంత్​ఉండే ప్రాంతానికి తీసుకెళ్లి ఆపాడు.  ఇది గమనించిన తేజస్​పారిపోయేందుకు యత్నించగా సిద్దేశ్వర్​నాయక్​, జయంత్​లు ముందుగా కత్తితో తేజస్ ను పొడిచారు. అనంతరం సమీర్​రాయితో కొట్టడడంతో  తేజస్​కిందపడగా.. శివప్ప కత్తితో అతని మెడను కోశాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకుని వెళ్లిపోతూ ప్రతీకార హత్య చేశామని వీడియోలు తీసి ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​చేశారు. తేజస్ హత్య కేసులో నిందితులైన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి వద్ద 6 సెల్​ఫోన్స్​, 4 బైక్ లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.