సీఎం కేసీఆర్, కేటీఆర్ వల్లే  అవార్డులు

సీఎం కేసీఆర్, కేటీఆర్ వల్లే  అవార్డులు
  • రాష్ట్రానికి 13 స్వచ్ఛ అవార్డులు
  • స్వచ్ఛ భారత్​ మిషన్​లో నంబర్ వన్ 
  • అక్టోబర్ 2న అవార్డుల ప్రదానం 
  • సీఎం కేసీఆర్, కేటీఆర్ వల్లే  అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్​లో రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. పారిశుధ్య నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్​ స్థానంలో నిలవడంతో పాటు వివిధ కేటగిరీల్లో13 స్వచ్ఛ అవార్డులు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ​గ్రామీణ్(ఎస్ఎస్ జీ) పెద్ద రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రానికి ఫస్ట్ ర్యాంక్​ వచ్చింది. జిల్లాల కేటగిరీలో జగిత్యాలకు దేశంలో సెకండ్ ​ర్యాంక్, నిజామాబాద్​కు థర్డ్ ర్యాంక్, అన్ని టాప్ జిల్లాల జోన్ల కేటగిరీలో నిజామాబాద్​​కు రెండో ర్యాంక్, భద్రాది కొత్తగూడెంకు మూడో ర్యాంక్ వచ్చింది.

సుజలం1.0, 2.0 రెండు క్యాంపెయిన్ల​ కేటగిరీల్లో తెలంగాణ దేశంలో వరుసగా థర్డ్ ర్యాంకులు సాధించింది. నేషనల్ ఫిలిమ్ కాంపిటీషన్ కేటగిరీలో రాష్ట్రంలోని నూకలంపాడు గ్రామ పంచాయతీ(ఎంకూరు మండలం) మూడో ర్యాంక్ సాధించింది. వాల్ పెయింటింగ్ కాంపిటీషన్ ఓడీఎఫ్​ ప్లస్ బయో డిగ్రేడబుల్ వ్యర్థాల మేనేజ్​మెంట్, గోబర్ ధాన్, ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్​మెంట్, మురుగు నీటి మేనేజ్​మెంట్, బహిరంగ మలవిసర్జన మేనేజ్​మెంట్ వంటి కేటగిరీల అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం సౌత్ జోన్​లో ఫస్ట్ ర్యాంకు సాధించింది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు.