ముంబై: మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. రోజురోజుకు పోలీస్ విభాగంలో వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 131 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం పోలీసు వర్గాల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,095 కు పెరిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయంలోగా ఇద్దరు సిబ్బంది చనిపోగా.. మరణించినవారి సంఖ్య 22 కు చేరుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసు వర్గాలు గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన 897 మంది సిబ్బంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,178 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ కేసుల్లో మహారాష్ట్ర దేశంలోనే టాప్ లో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటిదాకా 54,758 కేసులు నమోదయ్యాయి. 1792 మంది చనిపోయారు. 1,792 మంది కోలుకున్నారు.
In the last 24 hours, 131 police personnel have tested positive for #COVID19 and 2 deaths have been reported. Total number of positive cases in Maharashtra Police rise to 2095 with death toll at 22. Total 897 personnel have recovered and 1178 cases are active: Maharashtra Police pic.twitter.com/g2xhouxcZc
— ANI (@ANI) May 28, 2020