14నిమిషాల్లోనే అద్భుతం.. ఇండియన్ రైల్వే ఎక్స్ట్రార్డినరీ ఫీట్

14నిమిషాల్లోనే అద్భుతం.. ఇండియన్ రైల్వే ఎక్స్ట్రార్డినరీ ఫీట్

అక్టోబర్ 1, 2023న స్వచ్ఛతా పఖ్వాడాలో భాగంగా భారతీయ రైల్వే అసాధారణమైన ఫీట్‌ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిలిచిన వందే భారత్ రైళ్లను కేవలం 14 నిమిషాల సమయంలోనే ఏకకాలంలో శుభ్రపరిచారు. ఇలా చేయడం భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారి కావడం గర్వించదగ్గ విషయం. అన్ని జోన్‌ల జనరల్ మేనేజర్‌లు, అన్ని డివిజన్‌ల డివిజనల్ మేనేజర్‌లు, ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు, సీనియర్ అధికారులు తమ తమ జోన్‌లు మరియు డివిజన్‌లలో ఈ స్మారక ప్రయత్నంలో పాల్గొన్నారు.

'14మినిట్ మిరాకిల్' స్కీమ్

"ఇతర ఎండ్ టెర్మినల్ స్టేషన్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రేక్‌లను అత్యుత్తమ నాణ్యతతో శుభ్రం చేయడానికి సెంట్రల్ రైల్వే వినూత్నమైన 14మినిట్ మిరాకిల్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది" అని సెంట్రల్ రైల్వే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాంతో పాటు కొన్ని వీడియోలను సైతం పంచుకుంది.

ఈ వీడియోల్లో ఆదివారం మధ్యాహ్నం 12.42 గంటలకు రైలు ప్లాట్‌ఫారమ్ నెం. 8 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వద్ద, ప్రయాణికులందరూ దిగినట్లు కనిపించింది. ఆశ్చర్యకరంగా, మొత్తం శుభ్రపరిచే ప్రక్రియ మధ్యాహ్నం 12.56 గంటలకు రికార్డు స్థాయిలో 14 నిమిషాలకే పూర్తయింది.