
హైదరాబాద్, వెలుగు: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ క్షమాభిక్ష పెట్టింది. మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 14 మంది ఖైదీలను విడుదల చేసేందుకు రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది. వారి జాబితాను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు విడతల్లో వారిని విడుదల చేసేందుకు జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య చర్యలు ప్రారంభించారు. అక్టోబర్ 2, వచ్చే ఏడాది ఏప్రిల్ 6, అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు ₹50 వేల సొంత పూచీకత్తుతో బాండ్ సమర్పించాలని, బయటికొచ్చాక మళ్లీ నేరాలకు పాల్పడితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.
వీళ్లే ఆ ఖైదీలు
చంచల్గూడ జైలు: పీ కృష్ణ, అవినాష్, మహ్మద్ ఆరిఫ్, మద్దు జవహర్ బాబు
చర్లపల్లి సెంట్రల్ జైలు: సంపంగి వడ్డే శేఖర్, పీ వీరేశం
వరంగల్ సెంట్రల్ జైలు: దాదావత్ రాజు, మేక నరేశ్, యాట రమేశ్, కునరపు రాయమల్లు
కరీంనగర్:- వలమంజల తిరుపతి
నిజామాబాద్ జిల్లా జైలు:వీ ప్రవీణ్
మహబూబ్నగర్ జిల్లా జైలు: కవ్వు గోవిందు, కవ్వు సురేశ్