
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు. మరో 23 గంటల పాటు ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గంటకు గంటకు 60- నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశంఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దింతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ఇక మరికొన్ని జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు.
బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ తెలిపింది. హోర్డింగ్స్,చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు దగ్గర నిలబడరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండి ..అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు సంస్థ సూచించింది.