నా భర్త పిల్లిని ప్రేమిస్తున్నాడు.. కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన భార్య

నా భర్త పిల్లిని ప్రేమిస్తున్నాడు.. కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన భార్య

రాను రాను జనాలకు పిచ్చి ముదురుతోంది.  ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్దం కావడం లేదు.  కోర్టులు   ఊరికే ఉంటున్నారనుకుంటున్నారో.. ఏమో తెలియదు కాని.. వారికి ఏదో ఒక కంప్లయింట్​ చేస్తే పోలా.. అన్నవిధంగా బెంగుళూరుకు చెందిన ఓ మహిళ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది.  తన భర్త పిల్లిపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని.. తన వైవాహిక జీవితానికి పిల్లి అడ్డంకిగామారిందని ఆరోపిస్తూ... తనకు దక్కాల్సిన ప్రేమ పిల్లికి దక్కుతుందని ఫిర్యాదు చేస్తూ... తన భర్తపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. 

గతేడాది (2024) డిసెంబర్​లో   భార్య  చేసిన ఫిర్యాదు  ఆధారంగా భర్తపై 498 A కేసు నమోదైంది.  ఈ సెక్షన్​ ప్రకారం.. భార్యను .. భర్త వరకట్నం కోసం వేధించడం. .. భార్య పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేస్తారు. అయితే ఈ ఫిర్యాదులో భర్త తనను ప్రేమించకుండా వేధిస్తున్నాడని.. ఆయన పిల్లిని ప్రేమిస్తున్నాడని.. పిల్లి తనను గోకుతుందని ఫిర్యాదులో పేర్కొంది.  ఈ కేసు విచారణ ఊహించని మలుపులు తిరిగింది. 

తన భర్త పెంపుడు పిల్లితో గాఢమైన​అనుబంధాన్ని పెంచుకున్నాడని.. తన భర్త తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని.. దీని వలన తమ వివాహ బంధానికి ఆటంకం కలుగుతుందని ఫిర్యాదురాలు కోర్టుకు తెలిపింది.  ఈ కేసును విచారిస్తున్న జస్టిస్​ ఎం. నాగ ప్రసన్న  భార్య ఫిర్యాదులో మరొక మహిళ ఉందని భావించారు.  అయితే చార్జిషీట్​లో బొచ్చు గల జాతి పిల్లి ఫొటో ఉంది.  ఈ పిల్లినే ప్రేమిస్తున్నాడని కోర్టుకు తెలిపారు.  ఈ  కేసు చట్టం ప్రకారం క్రూరత్వం కాదని కోర్టుకు భర్త తరపు న్యాయవాది  తెలిపారు.  జడ్డి ఇది క్రిమినల్​ సమస్య కాదని.. వ్యక్తిగత.. భావోద్వేగ సమస్యగా పరిగణించారు.

Also Read : BSNL గేమ్ ఛేంజింగ్ ఆఫర్..చీపెస్ట్ ప్లాన్..డైలీ3GB డేటా

ఈ కేసు వీడియో ఎక్స్​ ట్విట్టర్​ లో '@Ambar_SIFF_MRA' అనే ఖాతాలో  షేర్ అయింది.  ఈ వీడియో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.  దేశంలో మహిళలు ఎలా మారారో చూడండి అంటూ.. నేను పిల్లికి సపోర్ట్​ చేస్తానని ఒకరు కామెంట్​ చేశారు.  ఇంకొకరు కోర్టు విడాకులు లేదా భరణం కూడా ఇవ్వాలని తీర్పు కూడా ఇచ్చే అవకాశం ఉందని మరొక యూజర్​ రాశారు.  కొన్ని సార్లు న్యాయమూర్తులు కేసును విచారించే విషయంలో  బాధను అనుభవిస్తారని ... అనవసరమైన కేసులు ఎందుకు దాఖలు చేస్తారో అర్దంకాని రాకెట్​ ప్రశ్న​అని మూడో వ్యక్తి కామెంట్​ బాక్స్​ ను నింపారు.  ఇంకా ఇలాంటి అర్దం లేని కేసులకు.. సమయం కేటాయించవలసి వచ్చినందుకు చాలా బాధగా ఉందని రాసుకొచ్చారు. 

అసలే కోర్టుల్లో గుట్టలు ... గుట్టలుగా కేసులు పేరుకుపోతున్నాయి.  ఇలాంటి అర్దం లేని కేసులు దాఖలు చేసిన వారిపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందు వారిపై చర్యలు తీసుకుంటే ఇలాంటివి మరల పునరావృతం కాకుండాఉంటాయి.