ఉత్తరాఖండ్ ప్రమాదం : 14కు చేరిన మృతల సంఖ్య..

ఉత్తరాఖండ్ ప్రమాదం : 14కు చేరిన మృతల సంఖ్య..

ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో మినీ బస్సు అలకనందా నదిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. రిషికేశ్–బద్రీనాథ్ హైవేపై నుంచి దాదాపు 250 మీటర్ల లోతులోకి పడిపోవడంతో మినీ బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు టెంపోలో 26 మంది యాత్రికులు ఉన్నారన్నారు పోలీసులు. చోప్టా సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. 
 
ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసు బృందాలు చేపట్టాయి. రోడ్డు పక్కన నిలబడి ఉన్న పలువురు కూడా ఈ ఘటనలో గాయపడ్డారన్నారు అధికారులు. గాయపడిన 12 మందిలో ఏడుగురిని రిషికేశ్ ఎయిమ్స్ కు, మిగతా క్షతగాత్రులను రుద్రప్రయాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. 

యాక్సిడెంట్ పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిషికేశ్ ఎయిమ్స్ కు వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్న వారిని పరామర్శించారు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు పుష్కర్ సింగ్ ధామి. 

అటు రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాద ఘటన తన గుండెను ముక్కలు చేసిందన్నారు ప్రధాని మోదీ స్థానిక అధికారులు బాధితులకు అండగా నిలవాలని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా మృతులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.