11 ఏళ్లకు ఇంటర్.. 14 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసిన వండర్ బాయ్

11 ఏళ్లకు ఇంటర్.. 14 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసిన వండర్ బాయ్

హైదరాబాద్: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెత ను మనుషులకు వర్తింప చేయాలనుకుంటే  14 ఏళ్ల అగస్త్య జైస్వాల్ కు సక్కగా సూటవుతుంది. చిన్నప్పటి నుండే మేధస్సులోనే కాదు.. ఆటల్లో.. కూడా అద్భుత ప్రతిభ చాటుతూ.. అందరూ ఔరా అనుకునేలా ఆశ్చర్యపరుస్తున్నాడు. ఓ వైపు టేబుల్ టెన్నిస్ లో జాతీయ స్థాయిలో రాణిస్తూ.. మరో వైపు చదువులోనూ అద్భుతంగా ప్రతిభ చాటుతున్నాడు. వండర్ బాయ్ అగస్త్య జైస్వాల్ పుట్టి పెరిగిందీ కూడా ఇక్కడే. కాచిగూడ లో నివాసం ఉండే భాగ్యలక్ష్మి, అశ్వనికుమార్ దంపతుల కుమారుడే అగస్త్య జైస్వాల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వెలుగులోకి వచ్చిన తొలి బాల మేధావిగా రికార్డు సృష్టించాడు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలతో అగస్త్య  హాట్ టాపిక్ అయ్యాడు. యూసుఫ్ గూడలోని సెయింట్ మెరీ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చదువుతూ..  ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ పూర్తి చేశాడు. అంతుకు ముందు 9 ఏళ్ల వయసులోనే టెన్త్ పూర్తి చేసి వండర్ బాయ్ అనిపించుకున్న అగస్త్య.. మరో రెండేళ్లలో అంటే 11 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేశాడు. 12 ఏళ్లకు డిగ్రీలో చేరి.. మూడేళ్లలోనే డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేశాడు. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌ మేరీ కాలేజీలో బీఏ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం చదివాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్‌ పూర్తి చేశాడు. డిగ్రీ ఫలితాలతో మరోసారి బాల మేధావి అని నిరూపించుకున్న అగస్త్యను.. తల్లిదండ్రులను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. వారి సూచనలు పాటించడం వల్లే ఆటపాటల్లో రాణించగలుగుతున్నానని చెప్పాడు.

Read more news

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు