
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) అమలు చేసే సోషల్ సెక్యూరిటీ స్కీమ్కోసం 2022 మార్చి లో 14.05 లక్షల మంది కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తెలిపింది. అంతకుముందు నెలలో వీటి సంఖ్య 12.70 లక్షలని ప్రకటించింది. ఈఎస్ఐసీలో స్థూలంగా కొత్త ఎన్‌రోల్‌మెంట్‌లు 2021–-22లో 1.49 కోట్లు కాగా 2020–-21లో 1.15 కోట్లకు చేరాయి. 2019–-20లో 1.51 కోట్ల మంది చేరగా, 2018–-19లో 1.49 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. 2017 సెప్టెంబర్ నుండి 2018 మార్చి వరకు దాదాపు 83.35 లక్షల మంది కొత్త సబ్‌స్క్రయిబర్లు ఈఎస్ఐసీ పథకంలో చేరారు. 2017 సెప్టెంబర్ నుండి 2022 మార్చి వరకు ఈఎస్ఐసీలో స్థూలంగా కొత్త చేరికలు 6.48 కోట్లని ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈఎస్ఐసీతోపాటు ఈపీఎఫ్ఓ కోసం పీఎఫ్ఆర్డీఏ కొన్ని సామాజిక భద్రతా పథకాలను నిర్వహిస్తోంది.