
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని చత్తీస్ గఢ్ లో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. రాయ్ పూర్ నుంచి 15 కిలోమీటర్ల వరకు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మానవహారంగా ఏర్పాడ్డారు. రాయ్ పూర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది, పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. జాతి సమైక్యతను చాటేందుకే ఇలా చేసినట్టు చెప్పారు అధికారులు.