150మెడికల్ కాలేజీలకు ముప్పు.. గుర్తింపు రద్దు చేయనున్న ఎన్ఎంసీ

150మెడికల్ కాలేజీలకు ముప్పు.. గుర్తింపు రద్దు చేయనున్న ఎన్ఎంసీ

దేశంలోని దాదాపు 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నాయి. ఇప్పటికే 40 మెడికల్ కాలేజీలు గుర్తింపు కోల్పోయాయి. కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, సౌకర్యాలు లేకపోయినా, పాటించకపోయినా నేషనల్ మెడికల్ కమిషన్ ఆయా కళాశాలల రద్దు చేసే హక్కు ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటిస్తున్నామని కమిషన్ ముందు నిరూపించుకుంటేనే ఇప్పుడు గుర్తింపు కోల్పోయిన కళాశాలలు తిరిగి గుర్తింపు పొందుతాయి.

గుర్తింపు కోల్పోయిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లోని మెడికల్ కాలేజీలు ఉన్నట్టు సమాచారం. కమిషన్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెల రోజులుగా నిర్వహించిన తనిఖీలో సిసిటివి కెమెరాలు, ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు విధానాల్లో లోపాలు, ఫ్యాకల్టీ రోల్స్‌లో లోపాలు బయటపడ్డాయి.

కమిషన్ కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెలరోజులుగా నిర్వహించిన తనిఖీలో CCTV కెమెరాలు, ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు విధానాలుసహా ఫ్యాకల్టీ రోల్స్ లో లోపాలు బయటపడ్డాయి. గుర్తింపు కోల్పోయిన మెడికల్ కాలేజీలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2014 నుంచి వైద్య కళాశాలల సంఖ్య దాదాపు రెండుసార్లు పెరిగింది. 2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2023లో, ఈ సంఖ్య 660కి పెరిగింది.