- ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు 150 మంది ఎంపిక
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు: మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు అపూర్వ స్పందన లభించిందని మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్ తెలిపారు.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో చేపట్టనున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి అర్హులైన విద్యార్థుల ఎంపిక కోసం ఈ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 750 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈ పరీక్షలో మెరిట్ సాధించిన 150 మంది విద్యార్థులకు 50 రోజుల పాటు పూర్తిగా ఉచిత రెసిడెన్షియల్ విధానంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా అకడమిక్ శిక్షణతో పాటు వసతి, పౌష్టికాహారం కల్పించనున్నట్లు వెల్లడించారు.
