ఇమ్యూనిటీ కోసం 15 వేల కోట్లు ఖర్చు

ఇమ్యూనిటీ కోసం 15 వేల కోట్లు ఖర్చు
  • ఇమ్యూనిటీ బూస్టర్ల కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిన ఇండియన్స్‌‌‌‌
  • యాంటివైరల్‌‌‌‌, యాంటిబయోటిక్‌‌‌‌ మెడిసిన్స్‌‌‌‌కు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌
  • గత 12 నెలల ట్రెండ్‌‌‌‌ను బయటపెట్టిన ఏఐఓసీడీ

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: కరోనా వలన హెల్త్‌‌, వెల్‌‌నెస్‌‌పై ప్రజల ఫోకస్‌‌ పెరిగింది. గత ఏడాది కాలంలో కేవలం విటమిన్‌‌లు, ఇమ్యూనిటీ బూస్టర్ల కోసం సుమారు  రూ. 15,000 కోట్లను ఖర్చు చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు. వీటితో పాటు  కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో డైరక్ట్‌‌గా వాడుతున్న ఫావిపిరవిర్‌‌‌‌, రెమ్డెసివిర్, అజిత్రోమైసిన్‌‌ వంటి వాటికి ఫుల్‌‌ డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఆల్‌‌ ఇండియా ఆర్గనైజేషన్‌‌ ఆఫ్​ కెమిస్ట్స్‌‌ అండ్‌‌ డ్రగ్గిస్ట్స్‌‌ (ఏఐఓసీడీ) డేటా ప్రకారం, కిందటేడాది జూన్‌‌  నుంచి ఈ ఏడాది మే నెల మధ్య  రూ. 14,587 కోట్ల విలువైన విటమిన్లను, ఇమ్యూనిటీ బూస్టర్లను ఇండియన్స్‌‌ కొనుగోలు చేశారు. అంతకు ముందటి ఏడాది ఇదే టైమ్‌‌తో  పోలిస్తే వీటి అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఒక్క విటమిన్‌‌ డీ అమ్మకాలే రూ. 817 కోట్లకు మించాయి. ముందు ఏడాది కాలంతో పోలిస్తే వీటి అమ్మకాలు 40 శాతం పెరిగాయి. జింక్‌‌ సప్లిమెంట్స్‌‌ సేల్స్‌‌ మూడు రెట్లు పెరిగి రూ. 183 కోట్లకు, విటమిన్‌‌ సీ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగి రూ. 340 కోట్లను టచ్ చేశాయి. 

మల్టీవిటమిన్స్‌‌కు గిరాకీ..
ఇమ్యూనిటీని పెంచే లక్షణాలుండడంతో మల్టీవిటమిన్స్‌‌కు ఫుల్‌‌ గిరాకీ ఏర్పడింది.  మల్టీవిటమిన్‌‌ బ్రాండ్‌‌ అయిన జింకోవిట్‌‌ (అపెక్స్‌‌ ల్యాబ్స్‌‌) సేల్స్ మూడు రెట్లు పెరిగి రూ. 585 కోట్లుగా నమోదయ్యాయి. అబాట్‌‌ హెల్త్‌‌కేర్ తయారు చేస్తున్న విటమిన్ సీ సప్లిమెంట్ బ్రాండ్‌‌ లిమ్‌‌సీ అమ్మకాలు రూ. 192 కోట్లను టచ్‌‌ చేశాయి. అల్‌‌కెమ్‌‌ ల్యాబ్స్‌‌కు చెందిన విటమిన్ డీ బ్రాండ్‌‌ అప్‌‌రైజ్ డీ3 అమ్మకాలు డబుల్ అయ్యి రూ. 132 కోట్లకు పెరిగాయి. మల్టీవిటమిన్ బ్రాండ్లయిన ఏ టూ జెడ్‌‌ అమ్మకాలు 58 శాతం పెరగగా, సుప్రడైన్‌‌ అమ్మకాలు 76 శాతం పెరిగాయి. సన్‌ఫార్మా తయారుచేస్తున్న రెవిటల్‌‌ హెచ్‌  సేల్స్‌ ఏడాది ప్రాతిపదికన 52 శాతం పెరిగి రూ. 200 కోట్లకు చేరకున్నాయి. ముందు ఏడాది ఈ అమ్మకాలు రూ. 132 కోట్లుగా ఉన్నాయి.  ఇదే టైమ్‌లో ప్రొటినెక్స్‌‌ సేల్స్‌‌ 64 శాతం ఎగిశాయి. డైరెక్టర్‌‌‌‌ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌‌ (డీజీహెచ్‌‌ఎస్‌‌) తాజాగా విడుదల చేసిన గైడ్‌‌లైన్స్‌‌లో ఫావిపిరవిర్‌‌‌‌, ఐవార్‌‌‌‌మెక్‌‌టిన్‌‌, అజిత్రోమైసిన్‌‌, డోసీసైక్లిన్‌‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌‌ డ్రగ్స్‌‌ను కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో డైరెక్ట్‌‌గా వాడకూడదని పేర్కొంది. అంతేకాకుండా జింక్ సప్లిమెంట్స్‌‌, మల్టీవిటమిన్స్‌‌కు కూడా ఈ గైడ్‌‌లైన్స్‌‌లో చోటుదక్కలేదు. రెమ్డెసివిర్‌‌‌‌, టోసిలిజుమాబ్‌‌ వాడకాన్ని కూడా కొన్ని పరిస్థితులకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేసింది. అయినప్పటికీ డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌‌లో సడెన్ చేంజ్ ఉండకపోవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. 

కంపెనీల ఆదాయాలు పైకి..
సెకెండ్‌‌ వేవ్‌‌ వలన యాంటివైరల్‌‌ డ్రగ్స్ అయిన ఫావిపిరవిర్‌‌‌‌, రెమ్డెసివిర్‌‌‌‌ డ్రగ్స్‌‌కు ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయ్యిందని ఏఐంఓసీడీ ఏడబ్ల్యూఏసీఎస్‌‌ మార్కెటింగ్‌‌ ప్రెసిడెంట్ శీతల్‌‌ సాపల్‌‌ అన్నారు.  కరోనా కేసులు పెరుగుతుండడంతో యాంటిబ్యాక్టీరియల్‌‌ డ్రగ్‌‌ డొసీసైక్లిన్‌‌, అజిత్రోమైసిన్‌‌, యాంటి పారాసిటిక్‌‌ మెడిసిన్‌‌ ఐవామెక్‌‌టిన్‌‌ సేల్స్‌‌ ఊపందుకున్నాయని పేర్కొన్నారు. కాగా, సరియైన టైమ్‌‌లో ఈ డ్రగ్స్‌‌ను తీసుకొచ్చిన కంపెనీల ఆదాయాలు పెరిగాయి. దేశంలో మొదటి సారిగా ఫావిపిరవిర్‌‌‌‌ డ్రగ్‌‌ను గ్లెన్‌‌మార్క్‌‌ ఫార్మా తీసుకొచ్చింది. గత 12 నెలల్లో ఈ మెడిసిన్‌‌ను అమ్మడం ద్వారా రూ. 975 కోట్ల రెవెన్యూను కంపెనీ సంపాదించగలిగింది. ఇదే టైమ్‌‌లో అమ్ముడైన ఫావిపిరవిర్‌‌‌‌ డ్రగ్‌‌ సేల్స్‌‌లో గ్లెన్‌‌మార్క్‌‌ఫార్మా ఫాబిఫ్లూ అమ్మకాలు 75 శాతం వాటాను పొందాయి. రెమ్డెసివిర్ అమ్మకాల వల్ల సిప్లా రూ. 309 కోట్లను, కాడిలా హెల్త్‌‌కేర్‌‌‌‌ రూ. 215 కోట్లను సంపాదించగలిగాయి.  టొరంటో ఫార్మా తయారు చేస్తున్న కాల్సియం ట్యాబ్లెట్లు షెల్కాల్‌ సేల్స్ పెరిగాయి. కిందటేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య ఈ ట్యాబ్లెట్ల అమ్మకాలు రూ. 279 కోట్లకు చేరుకున్నాయి. 

యాంటివైరల్, యాంటిబయోటిక్‌‌ డ్రగ్స్‌‌ సేల్స్‌‌ పెరిగాయ్‌‌..
ఇదే టైమ్‌‌లో యాంటిబయోటిక్‌‌, యాంటివైరల్‌‌ డ్రగ్స్‌‌కు ఫుల్‌‌ డిమాండ్ క్రియేట్ అయ్యింది. ప్రజల్లో కరోనా భయాలు నెలకొనడంతో ఫావిపిరవిర్, రెమ్డెసివిర్‌‌‌‌, అజిత్రోమైసిన్‌‌ వంటి డ్రగ్స్‌‌ సేల్స్ ఊపందుకున్నాయి. గత ఏడాది కాలంలో  యాంటివైరల్‌‌ డ్రగ్స్‌‌, యాంటి బయోటిక్‌‌ డ్రగ్స్‌‌  ప్రిస్క్రిప్షన్లు పెరిగాయి. ఈ టైమ్‌‌లో  ఫావిపిరవిర్ సేల్స్‌‌  రూ. 1,220 కోట్లకు చేరుకోగా,  రెమ్డెసివిర్‌‌‌‌ అమ్మకాలు రూ. 833 కోట్లను దాటాయి.   అజిత్రోమైసిన్ సేల్స్‌‌ రూ. 992 కోట్లకు, డోసీసైక్లిన్‌‌ సేల్స్‌‌ మూడు రెట్లు పెరిగి రూ. 85 కోట్లకు చేరుకున్నాయి. యాంటిపారాసిటిక్‌‌ డ్రగ్ అయిన ఐవామెక్‌‌టిన్‌‌ డ్రగ్‌‌ సేల్స్‌‌ 10 రెట్లు పెరిగి రూ. 237 కోట్లను టచ్ చేశాయి. ఈ సేల్స్ డేటా కూడా మెడిసిన్ షాపులు వంటి పబ్లిక్‌‌కు అమ్మే ప్లేస్‌‌ల నుంచి  ఏఐఓసీడీ తీసుకొంది. ఫార్మా కంపెనీలు డైరెక్ట్‌‌గా హాస్పిటల్స్‌‌కు సేల్‌‌ చేసే మెడిసిన్స్‌‌, విటమిన్స్‌‌ను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ ఈ డేటా కూడా అందుబాటులో ఉంటే వీటి అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ‘స్టాక్‌‌ను స్టోర్ చేసే వాళ్ల నుంచి డేటాను ఏఐఓసీడీ తీసుకొంది. అందువలన ఫార్మా కంపెనీలు డైరెక్ట్‌‌గా హాస్పిటల్స్‌‌కు, ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌కు అమ్మిన డ్రగ్స్‌‌ డేటా ఏఐఓసీడీ డేటాలో కలిసుండకపోవచ్చు’ అని ఇండియా రేటింగ్స్‌‌ అండ్ రీసెర్చ్‌‌ అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌ క్రిష్ణనాథ్​ ముండే అన్నారు.