జియో బ్లాక్‌‌‌‌రాక్ నుంచి 5 ఎంఎఫ్ స్కీమ్స్..సెబీ గ్రీన్సిగ్నల్

జియో బ్లాక్‌‌‌‌రాక్ నుంచి 5 ఎంఎఫ్ స్కీమ్స్..సెబీ గ్రీన్సిగ్నల్

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్  బ్లాక్‌‌‌‌రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్ అయిన జియో బ్లాక్‌‌‌‌రాక్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్,  ఐదు మ్యూచువల్ ఫండ్ పథకాలను ప్రారంభించడానికి సెబీ నుంచి ఆమోదం పొందింది. 

వీటిలో జియో బ్లాక్‌‌‌‌రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్, జియో బ్లాక్‌‌‌‌రాక్ నిఫ్టీ, 8–-13 ఏళ్ల జీసెక్​ ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌‌‌‌రాక్ నిఫ్టీ స్మాల్‌‌‌‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్‌‌‌‌రాక్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్,  జియో బ్లాక్‌‌‌‌రాక్ నిఫ్టీ మిడ్‌‌‌‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఉన్నాయి. 

ఈ ఐదు పథకాలలో నాలుగు ఈక్విటీ -ఓరియెంటెడ్ ఇండెక్స్ ఫండ్లు కాగా ఒకటి డెట్-ఓరియెంటెడ్ ఇండెక్స్ ఫండ్. ఈ నెల ఏడో తేదీన జియో బ్లాక్‌‌‌‌రాక్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ తన తొలి న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్​ఎఫ్​ఓ) ముగిసినట్టు ప్రకటించింది. మొత్తం రూ. 17,800 కోట్ల పెట్టుబడులను సమీకరించినట్టు తెలిపింది. 

ఈ నిధులు మూడు నగదు/డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలైన- జియో బ్లాక్‌‌‌‌రాక్ ఓవర్‌‌‌‌నైట్ ఫండ్, జియో బ్లాక్‌‌‌‌రాక్ లిక్విడ్ ఫండ్,  జియో బ్లాక్‌‌‌‌రాక్ మనీ మార్కెట్ ఫండ్ నుంచి సేకరించింది.