
న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రత కోసం ఎర్టిగా, బాలెనో కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చనున్నట్టు మారుతి సుజుకి ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఈ రెండు మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు పెరగనున్నాయి.
ఈ మోడళ్ల అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించనుంది. ఫలితంగా ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర సగటున 1.4శాతం పెరగనుండగా, బాలెనో ధర 0.5శాతం పెరగనుంది. కొత్త ధరలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.
ఈ సంవత్సరం చివరి నాటికి తమ అన్ని ప్యాసింజర్ వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం, మారుతి సుజుకి తన 10 మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తోంది. వీటిలో ఆల్టో కే10, సెలెరియో, వాగన్ఆర్, ఈకో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా వంటి మోడల్స్ ఉన్నాయి.