
హైదరాబాద్, వెలుగు: బ్రోకరేజ్ సంస్థ పీఎల్ (ప్రభుదాస్ లీలాధర్) క్యాపిటల్ నిఫ్టీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 26,889 స్థాయి చేరవచ్చని ప్రకటించింది. ఫార్మాస్యూటికల్స్, కొన్ని కన్స్యూమర్ స్టేపుల్స్, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, పవర్ వంటి రంగాల పనితీరు బాగుంటుందని అంచనా వేసింది.
దీని రిపోర్ట్ ప్రకారం..ఈ రంగాలు మార్కెట్ ర్యాలీ తదుపరి దశకు నాయకత్వం వహిస్తాయి. ప్రపంచ అనిశ్చితులు, టారిఫ్ యుద్ధాలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ నిలదొక్కుకుంటున్నది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ప్రభుత్వ ముందస్తు మూలధన వ్యయం భారీగా ఉంది.
రిజర్వు బ్యాంకు రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించడం మార్కెట్లకు మేలు చేస్తుంది. నగదు నిల్వల నిష్పత్తి తగ్గింపు లిక్విడిటీని, క్రెడిట్గ్రోత్ను పెంచుతుంది. సాధారణ వర్షపాతం, ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం, ఆదాయపు పన్ను ఉపశమనం వంటి అంశాలు కూడా మార్కెట్లకు మేలు చేస్తాయని పీఎల్ క్యాపిటల్ రిపోర్ట్ పేర్కొంది.