మాకు వందల మంది ఉద్యోగులు కావాలె.. ఫిన్‌‌టెక్ సంస్థ

మాకు వందల మంది ఉద్యోగులు కావాలె.. ఫిన్‌‌టెక్ సంస్థ
  • ప్రకటించిన ఫిన్​టెక్​ కంపెనీ వైజ్​​

హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ ​మనీ ట్రాన్స్​ఫర్​సేవలు అందించే ఫిన్‌‌టెక్ సంస్థ వైజ్ లీడర్షిప్​​టీమ్​ హైదరాబాద్‌‌లోని తన ఫుల్​స్టాక్​హబ్​ను మంగళవారం సందర్శించింది.   ప్రొడ‌‌క్టులు, ఇంజినీరింగ్, ఆప‌‌రేష‌‌న్ల విభాగాల కోసం రాబోయే కొన్నేళ్లలో వందల మందిని తీసుకుంటామని సంస్థ సీనియర్​ఎగ్జిక్యూటివ్​ఎస్​కే సరోగీ చెప్పారు. 

ఈ ఏడాది ఏప్రిల్లో 70 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ ఆఫీసు గ్లోబల్​​ఆపరేషన్స్​కు సహకరిస్తుందని వైజ్​వెల్లడించింది.  భారతీయ బిజినెస్​లు,  ఫ్రీలాన్సర్లకోసం ఒక కొత్త పేమెంట్​ ఫీచర్‌‌ను కూడా ఈ ఫిన్​టెక్​ కంపెనీ ప్రారంభించింది. దీంతో వ్యాపార సంస్థలు, 8 ప్రధాన కరెన్సీలలో విదేశాల నుంచి చెల్లింపులను పొందవచ్చు. 

వైజ్ తన సేవలను 160కి పైగా దేశాలలో, 40కి పైగా కరెన్సీలలో అందిస్తోంది.