శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున బంగారం స్వాధీనం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ రోజు కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం  బయటపడింది. ఎయిర్ పోర్ట్ లోని కార్గో విభాగంలో తనిఖీలు చేస్తున్న కస్టమ్స్ అధికారులకు 150 కిలోలకు పైగా బంగారం పట్టుబడింది. మలేషియా నుంచి హైదరాబాద్ కు ఈ బంగారం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.  ఇప్పటివరకు కనీవిని రీతీలో ఇంత భారీగా బంగారం పట్టుబడడంతో అధికారులు సైతం అవాక్కవుతున్నారు.

ఆర్కే డిజిటల్‌ అనే ఓ సంస్థ అక్రమంగా ఈ బంగారాన్ని తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీని వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.  బంగారాన్ని  స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఈ సంస్థకు ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులూ లేకపోయినా పెద్ద ఎత్తున బంగారం తరలించి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.